కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించని సోమవారం మాజీ ఎంపీపీ దశరథ్రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలోని పోసానిపెట్ లో ఆయన మాట్లాడుతూ.. వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలో అర్హులైన 1360 మంది రైతులకు రుణమాఫీ కావలసి ఉండగా, కేవలం 540 మంది రైతులకు రుణమాఫీ వర్తించింది అని అన్నారు. రైతుల పక్షాన నిలబడవలసిన జిల్లాస్థాయి, మండల స్థాయి నాయకులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, ప్రజలు, రైతులు గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తిరుపతి, రవి, సుతారి నరేష్, తెడ్డు దినేష్, బండి రాములు, తదితరులు పాల్గొన్నారు.