
నవతెలంగాణ భువనగిరి రూరల్
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం రైతు రుణమాఫీ కేసర్ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హాజరై, మాట్లాడారు. రుణ మాఫీ ఒకేసారి చేసి కొత్త బ్యాంకు రుణాలు ఇవ్వాలని ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సవరించి రైతాంగాన్ని ఆదుకోవాలని పంటల నష్టపరిహారం రైతులకు కౌలు రైతులకు ఇవ్వాలని పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని మద్దతు ధరలను డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం నిర్ణయించి అమలు చేయాలని జిల్లాలోని రాయగిరి రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రాంతీయవలహ రహదారి అలైన్మెంట్ను మార్చాలని, వరి ధాన్యానికి వెంటనే డబ్బులను రైతులకు ఇవ్వాలని నకిలీ విత్తనాలను అమ్మేవారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. పోచంపల్లి మండలంలోని పెద్ద రావులపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో రైతులు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాయగిరి రైతుల పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అలైన్మెంట్ను మార్చాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పైల యాదిరెడ్డి, జిల్లా కార్యదర్శి జక్క దయాకర్ రెడ్డి ఉప్పుల కొమురయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ చెక్క వెంకటేష్ ఎండి ఇమ్రాన్ సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ రైతు సంఘం నాయకులు కొమ్ము దయాకర్ సంగెం గణేష్ తెడ్డుఆంజనేయులు సాయిలు బిక్షం మహిళా రైతులు పాల్గొన్నారు.