– కొడంగల్ అభివద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కషి
– రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ ఆర్.గుర్నాథ్ రెడ్డి
నవతెలంగాణ-కోడంగల్
రైతులను ఆదుకునేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ గుర్నాథ్‌రెడ్డి అన్నారు. కొడంగల్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, టపాసులు పేలుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడంతో సీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయలలోపు ఉన్నవారికి రుణమాఫీ అయిందని, రెండు లక్షల వరకు ఉన్న వారికి త్వరలోనే అవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని మహిళలు సంతోషంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించు కుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మెడికల్ కళాశాల, కోస్గి ఇంజనీరింగ్ కళాశాలలు ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది పేదరికంతో చదవలేని వారికి గురుకులాలలో సీట్లు కేటాయిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిపించడంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అభివద్ధి చేయాలనే దఢ సంకల్పంతో రేవంత్‌రెడ్డి ఉన్నారని ఈ ప్రాంత ప్రజలు సహకరించాలన్నారు. రూ.36 కోట్లతో రుణమాఫీ చేయడం గొప్ప విషయం అన్నారు. రైతులు కష్టపడి పంటలు పండించి సుఖంగా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి రేవంత్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఏనుగుల భాస్కర్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మునీర్, మాజీ సర్పంచులు సయ్యద్ అంజాద్, పకీరప్ప, సాయిలు పీఎస్‌సీఎస్ చైర్మెన్ కటకం శివకుమార్, కౌన్సిలర్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నయుం, మాజీ ఉపసర్పంచ్ ఎస్‌ఎం గౌసన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.