– లబ్ధిదారులను కుందించే కుట్ర
– జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ పై ఎక్కడ క్లారిటీ లేదని, అధికారులు మాఫీ చేసే అందరి లిస్ట్ బయటపెట్టాలని నల్ల గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆరోపించారు. ఎంతోమంది కి ఎగ్గొట్టారని, అర్హత ఏ నిబంధనల మేరకు నిర్ణయించారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీరు సంబరాలు చేస్తున్నారు. కానీ రైతు లు అయోమయంలో వున్నారని, ఈ విషయములో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో రూ. 945 కోట్లు రుణమాఫీ చేశారని, కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 10 44 కోట్లు మాఫీ చేశారని, మరి మీరు ఎందుకు తక్కువ చేశారని ప్రశ్నించారు. లబ్ధిదారులను కుందించే కుట్ర చేశారని, రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీతో సభ పెడతాం అంటున్నారని, దానికంటే ముందు అందరికి రుణాల మాఫీ చేయాలి, అందరికి రైతు బంధు డబ్బుల ఇచ్చి, ఆ తర్వాత సభ పెట్టాలని హితవు పలికారు.
అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని, హరీష్ రావుని రాజీనామా చేయమని అడి గే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని, హరీష్ రావు ఆగష్టు లోపు రుణమాఫీతో పాటు ఎన్నికల సమయంలో 6 గ్యారంటీ పథకాలు నెర వేర్చాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఒక వేల మీరు నెరవెరిస్తే నేను నా శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మేధావుల చేతి కిస్తా, నీవు హామీలు నెరవేర్చకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మేధావుల చేతికి యివ్వు అని సవాల్ విసిరారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ అమలు చేసి హరీష్ రావుని రాజీనామా చేయ మనటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. మీకుచిత్తశుద్ధి ఉంటే మీరు అందరికి 100 శాతం రుణమాఫీ చేయాలి. రాజీనామాలు మాకు కొత్త కాదు. ఎన్నో హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారు. దుర్మార్గపు పాలన మీది, నిరుద్యోగులను వాడుకొని వదిలేశారు. వాళ్ల అవసరం తప్పక తగులుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, ఐసీడీఎస్ మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, మున్సిపల్ ప్లొర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నిరంజన్ వలి, బక్క పిచ్చయ్య, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రీ, రంజిత్, నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు బొనగిరి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.