లక్షా రూపాయల ఎల్ఓసీ అందజేత..

LoC of one lakh rupees awarded..నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని యెల్ల రెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఒంటరి వజ్రమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న రనే విషయాన్ని డిసిసి డెలిగేట్ తలారి సుధాకర్, సీనియర్ నాయకులు కర్స మ్మోహన్, ఎన్ఎస్ యుఐ రూరల్ అధ్యక్షులు ఆశిష్, గ్రామ శాఖ అధ్యక్షులు షారుక్ లు కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లిన వేంటనే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఒక లక్ష రూపాయలను మంజూరు చేయించి దానికి సంబంధించిన ఎల్ఓసిని ఆయన కుమారుడికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దృష్టికి ఏ సమస్య తీసుకొని వెళ్ళిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారని వారన్నారు. విషయం తెలిపిన వెంటనే మంజూరు చేయించిన ఎమ్మెల్యేలకు వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముజాహిద్ ,వి రాజన్న తదితరులు ఉన్నారు.