– మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్ పెంచికల్ పేట గ్రామానికి చెందిన దాడి యశ్వంత్ వెంకటపూర్ ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చెరింది.వైద్య ఖర్చుల కోసం సహాయ నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీదర్ బాబును ఆశ్రయించారు. ఇందుకు మంత్రి దుద్దిళ్ల రూ.2.50 లక్షలు సిఎంఆర్ఏప్ ఎల్ఓసిని మంజూరు చేయించారు. మంగళవారం ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబానికి ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.