
వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన పి. వినోద్ అనారోగ్యంతో బాధపడుతూ హైదారాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స కొరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో కాంగ్రెస్ పార్టి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షల 50వేల ఎల్ఓసి ని ఇప్పించారు. ఎల్ఓసి పత్రాన్ని మంగళవారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్ ఓసి ఇప్పించిన ముత్యాల సునీల్ కుమార్ కు బాధితుడు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.