ఎల్ఓసీ అందజేత..

నవతెలంగాణ-బెజ్జంకి 

మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన దయ్యాల కనుకవ్వ వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల ఎల్ఓసీని అదివారం మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య చికిత్స కోసం ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే సత్యనారాయణకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ నాయకులు పులి కృష్ణ, దాచారం గ్రామ శాఖాధ్యక్షుడు రంగోని రాజు,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, నాయకులు జెల్లా ప్రభాకర, బైర మహేందర్, అమరగొండ రాజు, బోడిగే శ్రీనివాస్ పాల్గొన్నారు.