మండల కేంద్రానికి చెందిన మక్దూం అలీ షేక్ కు రెండు లక్షల రూపాయల ఎల్ఓసిని మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆలీ షేక్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ కొరకు హైదారాబాద్ లో నిమ్స్ హాస్పటల్ లో చేరారు. ఈ విషయమై బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించారు. అట్టి మంజూరు పత్రాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు మల్లెల లక్ష్మణ్, శేఖర్,రంజిత్ లు బాధితుడికి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ రెడ్డి, కు ధ్యవాదములు తెలిపారు.