బాధితునికి సీఎం సహాయ నిధి కింద ఎల్ఓసీ అందజేత

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామానికి చెందిన ఎం విజయ్ కుమార్ ఇటీవల హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం సహాయ నిధి కింద రూ.2,50,000 ఎల్ ఓ సి ని లబ్ధిదారునికి మంజూర్ చేయించారు. సోమవారం ఎల్ ఓ సి ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ శాఖ అధ్యక్షుడు కనకం రవీందర్, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, హరీష్, లు పాల్గొన్నారు.