నవతెలంగాణ – అశ్వారావుపేట
గత మూడు రోజులుగా నియోజక వర్గం లోని అన్నపు రెడ్డి పల్లి లో నిర్వహిస్తున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన లో మంగళవారం చేపట్టిన వికసిత భారత్ సెమినార్ లో అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్ధిని రవళి ప్రతిభ కనబరిచి ప్రధమ స్థానంలో నిలిచింది.దీంతో ఎంఈవో,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు, గైడ్ టీచర్ శ్యాం బాబు లు విద్యార్థిని రవళి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్ధుల్లో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసే అవకాశం ఉంది అన్నారు.