ఆర్మూర్ పట్టణంలో పెట్రోలు దొంగలు… ఆందోళనలో స్థానికులు

నవతెలంగాణ-ఆర్మూర్ :  పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ హుస్నాబాద్ గల్లీలో అర్ధరాత్రి సమయాలలో గుర్తుతెలియని దొంగలు ఇంటి ముందర పార్కింగ్ చేసిన బైక్లలో నుంచి పెట్రోలు దొంగలిస్తున్నారు. గత కొన్ని రోజుల్లో వాహనాల్లో పెట్రోలు దొంగలిస్తున్నట్టు తెలిసింది .గోల్డ్ బంగ్లా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ఓ ఇంటి ముందు ఉంచిన ఆటోను దొంగలించేందుకు ప్రయత్నించినారు. ఇంటి ముందు నుంచి కాస్త దూరంలో తీసుకెళ్లి ఆటో స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినారు ..దీంతో స్టార్ట్ కాకపోవడంతో అక్కడ వదిలి వెళ్ళిపోయారు. ఉదయం ఆటో యజమాని చూసి ఆటోను తీసుకొచ్చినాడు. ఆటో యజమాని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినాడు.