ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డు పొందిన లోకేశ్వరం విద్యార్థి

నవతెలంగాణ-లోకేశ్వరం : మండల కేంద్రానికి చెందిన కొమ్ముల శారద – కళ్యాణ్ రెడ్డి ల కుమారుడు కొమ్ముల దీపక్ రె్డి క్రికెట్ లో స్కూల్ గేమ్స్
పేడరేషన్ లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ నేపాల్ లో (సాఫ్ట్ బాల్ ) జాతీయ స్థాయి బీహార్ లో ( గ్రీస్ బాల్ )తో అండర్ 16 లెవెల్లో లో ఆడాడు. ఈ సందర్భంగా గురువారం జాతీయ క్రీడ దినోత్సవ సందర్భంగా అదనపు కలెక్టర్ పైజాన్ అహమ్మద్ చేతుల మీదుగా ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డు పొందాడు. కాగా దీపక్ రెడ్డి రాజుర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు అతన్ని అభినందించారు.