
జాబితాల లిస్టులో అర్హులైన వారి పేరులు లేదంటూ గ్రామ ప్రజలు అధికారుల మధ్య వాగ్దానం జరిగింది. బొమ్మలరామారం మండల మర్యాల గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. దీంతో ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. అర్హులైన నిరుపేద రైతు కుటుంబాలకు సంక్షేమ పథకాల గురించి గ్రామసభలో లొల్లిగా మారింది. నాలుగింటిలో ఏ పథకం పేద ప్రజలకు మంజూరు కాలేదని, జాబితాలో తమ పేరు రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈప్రజా పాలన గ్రామసభలో సభకు ప్రత్యేక అధికారిగా శ్రీ మాలిని పాల్గొన్నారు. లిస్టులో పేరు రానివారు మరొక్కసారి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.అలా చేసుకుంటే వారి పేరు కూడా నమోదు చేస్తామని హామీ ఇచ్చారు .ఎస్సై శ్రీశైలం రావడంతో లొల్లి కాస్త సల్లగా మారింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాంజ రెడ్డి ఎస్సై, గ్రామ పంచాయతీ సిబ్బందిని తదితరులు పాల్గొన్నారు.