ఓటు వినియోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్న లండన్ వేణుగోపాల్

నవతెలంగాణ – సిద్దిపేట
రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. లండన్ (గంప) వేణుగోపాల్. సిద్దిపేట 10వ వార్డుకు చెందిన గంప వేణుగోపాల్ 2002లో లండన్ వెళ్లి స్థిరపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, కేంద్ర, రాష్ట్ర, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే ఓటు హక్కును వినియోగించుకోవడంలో ముందుంటున్నారు. 2004, 2009, 2014, 2018, 2019  ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వచ్చి  ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నారై లకు ఆన్ లైన్ ,ప్రాక్సీ ఓటు హక్కు కోసం ఎదురు చూడలేదు. కష్ట పడి సంపాదించిన నా కష్టార్జితంతో కొంత దేశం కోసం వినియోగించాలని సిద్దిపేటకు వస్తున్నట్లు ఆయన నవ తెలంగాణతో తెలిపారు. 2004 ,2009, 2014, 2018, 2019 ప్రతి ఎన్నికల్లో 15 నుండి 35  రోజులవరకు ప్రతి ఎన్నికల్లో ఇండియా వచ్చి సిద్ధాంత పరంగా నేను నమ్మే నా కాంగ్రెస్ పార్టీ  తరపున ప్రచారం చేసి, పార్టీకి కొంత ఆసరా ఉండి, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.