ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌

ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌– ప్రారంభించిన మోడీ
ఇటానగర్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇటానగర్‌లోని ప్రపంచంలో అతి పొడవైన రెండు లైన్ల టన్నెల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ‘విక్షిత్‌ భారత్‌ విక్షిత్‌ నార్త్‌ ఈస్ట్‌’ కార్యక్రమంలో భాగంగా ద్విలైన్‌ సెలా టన్నెల్‌ను మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సెలా టన్నెల్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలాపాస్‌ మీదుగా తవాంగ్‌కి కనెక్ట్‌ అవుతుంది. దీన్ని రూ. 825 కోట్లతో నిర్మించారు. ఇది ఇంజనీరింగ్‌ అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టుకు 2019లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. ‘సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చెందకుండా చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. ఈ టన్నెల్‌ను కాంగ్రెస్‌ అభివృద్ధి చేయలేదు. కేవలం అరుణాచల్‌ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయని భావించి అభివృద్ధి చేయలేదు.’ అని ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు.