నన్ను చూసినావే పిల్ల…

Look at me baby...సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌, ప్రాచీ బంసాల్‌, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా మన్‌ మోహన్‌ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సోదరా’. క్యాన్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌, మాంక్‌ ఫిలిమ్స్‌ పై నిర్మాత చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సాంగ్‌ ‘అన్నంటే దోస్తే సోదరా’ మంచి సక్సెస్‌ అందుకోగా, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్‌ సింగిల్‌ ‘పిల్లా పిల్లా..’ సాంగ్‌ విడుదలైంది. ‘అన్నంటే దోస్తే సోదరా..’ సాంగ్‌ అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని తెలిపితే, తాజాగా రిలీజ్‌ అయిన ‘పిల్ల పిల్ల’ సాంగ్‌ ఒక ఫ్రెష్‌ ఫీల్‌తో మంచి రొమాంటిక్‌ లవ్‌ సాంగ్‌గా ఉంది. ఈ సాంగ్‌ లో సంపూర్ణేష్‌ బాబు లుక్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. ‘నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా..’ అంటూ సాగే ఈ సెకండ్‌ సింగిల్‌ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే దీమాతో మేకర్స్‌ ఉన్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌, ప్రాచీబంసాల్‌, ఆరతి గుప్తా, బాబా భాస్కర్‌, బాబు మోహన్‌, గెటప్‌ శీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ- దర్శకత్వం: మన్‌ మోహన్‌ మేనంపల్లి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, డిఓపి: జాన్‌, ఎడిటర్‌: శివశర్వాణి, లిరిక్స్‌: సుద్దాల అశోక్‌ తేజ, పూర్ణ చారి, ప్రొడ్యూసర్‌: చంద్ర చంగలా.