– యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్
లక్నో : యుపిలో పదవ తరగతి బోర్డ్ పరీక్షల్లో 98.5 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్ ఆదివారం తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రూపాన్ని కాదని, పరీక్షల్లో తాను సాధించిన మార్కుల్ని చూడాలని అన్నారు. ”నా ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటం వల్ల నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. నా రూపాన్ని కాదు.. మార్కుల్ని చూడండి” అని బదులిచ్చారు. ”చాణక్యుడు కూడా వేధింపులకు గురయ్యారు.అవి అతనిపై ప్రభావం చూపలేకపోయాయి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రాచీ కృతజ్ఞతలు తెలిపారు.