సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో.. ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ పట్ల వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.ఇచ్చిన మాటకు కట్టుబడే.. తమ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ,రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.6 వేలు అందిస్తుందన్నారు.జనవరి 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలను అమలుచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. మంగళవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.వారు మాట్లాడుతూ, తమది రైతుల మేలు కోరే ప్రభుత్వమన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్డీవో ఆఫీస్ తెస్తానని చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే ఏడాదవుతున్న ఆ ఉసే ఎత్తడం లేదని..ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మాటిమాటికి కాంగ్రెస్ సర్కార్ పై నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,కాంగ్రెస్ దుబ్బాక మండల అధ్యక్షులు కొంగర రవి,నాయకులు ఆకుల భరత్,మల్లుగారి రామచంద్ర రెడ్డి,శ్రీనివాసరెడ్డి,ఐరేని సాయితేజ,దుబ్బాక పర్శరాములు,అనంతుల రాజు,మిద్దె ప్రసాద్,పలువురు పాల్గొన్నారు.