– మాజీ ఇన్‌స్పెక్టర్ దుర్గారావుకు బెయిల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజాభవన్ ముందు బారీకేడ్లను ఢకొీన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ3గా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజరు కుమార్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాభవన్ ముందు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబారులో ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. సాహిల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. పంజాగుట్ట మాజీ ఇన్‌స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్‌స్పెక్టర్‌ను జడ్జి ముందు హాజరు పరిచామని చెప్పారు. వారిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరైనట్టు తెలిపారు. కాగా ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే, 2022 మార్చిలో జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఒక బాబు చనిపోయాడని, ఆ కేసులోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ను తప్పించారనే వార్తలు వచ్చాయన్నారు. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని.. కోర్టులో ట్రయల్ జరుగుతోందని తెలిపారు.