అక్బర్ పేట భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ర్యాకం శ్యామ్ రెడ్ మీ స్మార్ట్ మొబైల్ గత 7 నెలల క్రితం తన ఫోన్ ఎక్కడో పడిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో బాధితుడి వివరాలు నమోదు చేసి బ్లాక్ చేయగా.. తాజాగా టెక్నాలజీ ద్వారా ఫోన్ ను గుర్తించి మంగళవారం బాధితుడికి ఎస్సై అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై భువనేశ్వర్ మాట్లాడుతూ ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలను సీఈఐఆర్‌లో నమోదు చేయాలన్నారు. తద్వారా ఫోన్‌ను పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా మొబైల్ ఫోన్‌లు, అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీష్‌స్టేసన్‌లో అప్పగించాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ పార్టీ సిబ్బంది సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.