గల్లంతయిన ఓట్లు ఒక బూత్ లో నుండి మరో బూత్ కు మారిన ఓట్లు

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఓటర్లు బూత్ లెవెల్ అధికారులను సంప్రదించిన ఫలితం లేక వెనుతిరిగి పోయారు. కాగా మరికొందరి ఓట్లు వారి గ్రామంలో కాకుండా ఇతర గ్రామాల బూతుల్లో ఉండడంతో సమాచారం తెలిసినవారు అక్కడికి వెళ్లి ఓట్లు వేశారు. కోటగడ్డ గ్రామానికి చెందిన ఓట్లు కొన్ని రాంనగర్ గ్రామపంచాయతీలో పోలింగ్ బూతులు రావడంతో తెలిసినవారు అక్కడకు వెళ్లి ఓటు వేసి వచ్చారు. అదేవిధంగా గోవిందరావుపేట గ్రామానికి చెందిన కొందరి కోట్లు తాడువాయి మండలం దామెరలో ఉన్నట్లుగా బూతు లెవెల్ అధికారులు గుర్తించారు.
వృద్ధులైన ఓటర్లు పూర్తిస్థాయిలో వీల్ చైర్ లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రెండు లేక మూడు బూతులకు ఒక వీల్ చైర్ ఉండడంతో పదుల స్థాయిలో వచ్చిన వృద్దులు వీల్ చైర్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఓటు మాకొద్దు ఫలానా పార్టీకి వేయండి

ఓటు మాకొద్దు అలానా పార్టీకి వేయండి అంటూ కొందరు నాయకులు చెప్పడం కొందరు ఓటర్లు మిస్మయానికి గురైనట్లు తెలిపారు. గురువారం మండల వ్యాప్తంగా ఒక పార్టీకి చెందిన నాయకులు  బుధవారం వరకు తమకే ఓటు వేయాలని విస్తృతంగా కష్టపడి ప్రచారం నిర్వహించారు. ఏమైందో ఏమో గాని ఓటింగ్ ముందు సాయంత్రం నుండి ఓటింగ్ కొనసాగుతున్న క్రమంలో తమ బాణీ మార్చుకున్నారు. ఓటు మాకు వేయకపోయినా పరవాలేదు ఫలానా వ్యక్తికి, ఫలానా గుర్తుకు మాత్రం వేయొద్దని కొందరు, ఫలానా గుర్తుకు వేయాలని కొందరు సీనియర్ రాజకీయ నాయకులు ప్రచారం చేశారని ఈ ప్రచారంతో ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఓటర్లు ఆశ్చర్యానికి గురికావడం జరిగిందని పలువురు ఓటర్లు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.