జోరుగా బెల్ట్ దందా! 

నవతెలంగాణ-గోవిందరావుపేట: అదనపు ధరలకు విక్రయిస్తున్న బెల్టు యాజమాన్యం పైకి మామూలు షాపులు లోన మద్యం విక్రయాలు ఎన్నికల కోడ్ బెల్ట్ షాపులకు వర్తించదా! మండల వ్యాప్తంగా మద్యం బెల్ట్ జోరుగా సాగుతోంది. మద్యం షాపుల్లో లభించని సరుకు బెల్టు షాపుల్లో లభిస్తుంది. బెల్టు షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు యాజమాన్యం చిల్లు పెడుతోంది. ఎన్నికల కోడ్ మద్యం బెల్ట్ షాపులకు వర్తించదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు అంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చూసి చూడనట్టుగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చల్వాయి పసర గోవిందరావుపేట గ్రామాల్లో 163 వ జాతీయ రహదారి వెంట ఒక్కొక్క గ్రామంలో 10 నుండి 20 బెల్ట్ మద్యం  షాపులు నిర్వహిస్తున్న కూడా దాడులు ముగించాల్సిన అధికార యంత్రాంగం గమ్మునుంటున్నారని అంటున్నారు. గ్రామంలో ఎక్కడ మారుమూల ప్రాంతంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తూ మద్యం షాపులపై దాడులంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారు. పెద్ద పెద్ద బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే కళ్ళుండి చూడలేని యంత్రాంగం వారిచ్చిన సమాచారంతో చిన్న చిన్న వారిపై దాడులు చేస్తూ అజమాయిసి చలాయిస్తున్నారని అంటున్నారు. పాత మద్యం షాపులు మరో నెల రోజులు ఉండడం వారి అదృష్టం గా ఎన్నికలు రావడం బెల్టు మద్యం వ్యాపారానికి రెక్కలు వచ్చాయని పలువురు అంటున్నారు. మామూలు ఇచ్చే వారి షాపులు నిరంతరంగా నిరంభ్యంతరంగా కొనసాగుతున్నాయని ఎటూ వచ్చి పేద మధ్యతరగతి వాడు అమ్ముకుంటూనే వాడిపై దాడులు చేసి కేసులపాలు చేస్తున్నారని ప్రజలు తెలుపుతున్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేసే విధంగా విధులు నిర్వర్తించాలని ముందుగా 163 వ జాతీయ రహదారి వెంట నిర్వహిస్తున్న షాపులను మూసి వేయించి తమ నిజాయితీని ప్రజల ముందు ఉంచాలని అంటున్నారు. విరివిగా దాడులు నిర్వహిస్తున్నాం. ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో బెల్టు మద్యం షాపులపై విరివిగా దాడులు నిర్వర్తిస్తున్నామని సమాచారం ఇస్తే ఎక్కడ వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఒకచోట దాడులు నిర్వహిస్తున్న క్రమంలో మరోచోట ఎస్కేప్ అవుతున్నారని అన్నారు. ప్రతినిత్యం దాడులు కొనసాగిస్తున్నామని బెల్టు మద్యం షాపులు మరియు గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు కొనసాగిస్తూ వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేస్తున్నామని అన్నారు. దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నాం. పసర ఎస్సై ఎస్కే మస్తాన్ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మండలంలో చాలా ప్రదేశాల్లో గుడుంబా తయారీ కేంద్రాలు విక్రయ కేంద్రాలు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించామని ఇప్పటివరకు 25 పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు. ముందు ముందు కూడా ఈ దాడులు కొనసాగుతాయని గుడుంబా తయారు చేసే విక్రయించే వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. లైసెన్స్ మద్యం యాజమాన్యంతో కూడా చర్చలు జరపడం జరిగిందని బెల్టు షాపుల నియంత్రణకు కృషి చేస్తామని అన్నారు.