జోరుగా బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
జోరుగా ఇంటింటా బీఆర్ఎస్ నాయకుల ప్రచారం  దుబ్బాక మండలంలోని పద్మనాభునిపల్లిలో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలో  సుతారి పని చేస్తున్నా మెదక్ ఎంపీ,బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఓట్లు వేయాలని దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకులు ఎల్లు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు తీపి రెడ్డి మహేష్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ  వైస్ చైర్ పర్సన్ పండరి రాజ లక్ష్మణ్ రావు లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చాక చేసే మేనిఫెస్టోను వివరించారు.అనంతరం తాపీ పట్టి పనులు చేసి ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వారీ వెంట అశోక్,డైరెక్టర్ చిన్ని సంజీవ్ రెడ్డి ,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ,వన్నెల రవీందర్ గౌడ్, వాదర్ రహేమన్,రవి, బాబు తదితరులు ఉన్నారు