అక్రమ లే అవుట్‌లో జోరుగా భవన నిర్మాణాలు

– అనుమతులు లేకున్నా
– కొనసాగుతున్న పనులు
– స్పందించని స్థానిక అధికారులు
– పట్టించుకోని జిల్లా స్థాయి ఉన్నాతాధికారులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టన కేంద్రంలో అక్రమ లే అవుట్‌లో జోరుగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తాండూరు నియోజకవరగంలో అక్రమ లే అవుట్‌ నిర్మాణాలు జరుగు తున్న సంబంధితశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. తాండూరు పట్టణ కేంద్రంలో మున్సిపల్‌ అధికా రుల నిర్లక్ష్యం..ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా అక్ర మార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ లే అవుట్‌కు ఎలాంటి అనుమతులూ లేకున్న పనులు జోరు గా కొనసాగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. తాండూరు పట్టణ కేంద్రంలో అధికారులు అక్రమా ర్కులతో చేతులు కలిపి మామూళ్ల మత్తులో తూగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ లే అవుట్‌ పనులు జరిగిన అధికారులు పట్టించుకోక పోవడం దారు ణం. తాండూరు మున్సిపల్‌ పరిధిలోని ఉన్న సర్వేనంబరు 4,5, 6,7లల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులూ లేకుండానే లే అవుట్‌గా మార్చారు. అందులో భవన నిర్మాణాలు కొనసా గిస్తున్నారు. ప్రభుత్వం నుండి లే అవుట్‌ మార్చేందుకు భూమిలో 10 శాతం పార్కులకు కేటాయించాలి. రోడ్లు కూడా విశాలంగా ఉండాలి అన్ని వచ్చిన తరువాత ఈ భూమిలో లే అవుట్‌ పనులు ప్రారంభించాలి. అవి ఏమీ లేకుండానే రియల్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా లే అవుట్‌ చేశారు. ఏమీ అనుమతులు లేకుండానే ఆ భూమిలో సీసీరోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. కారణంగా తాండూ రు పట్టణం చూట్టూ అక్రమ లే అవుట్‌ నిర్మాణాలు రోజు రోజుకూ పుంజు కుంటున్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే రియల్‌ వ్యాపారులు భూములు కొని లే అవుట్‌గా మారుస్తున్నారు. తాండూరు అక్రమ లే అవుట్‌లే అధికంగా ఉన్నాయి. పట్టణంలో లే అవుట్‌ చేయాలంటే జిల్లా అధికారుల నుండికానీ రీజినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నుండి గానీ రెండున్నర ఎకరాల కంటే ఎక్కువా ఉంటే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ కంట్రీ నుండి అనుమతులు పొందాలి కానీ తాండూరులో అలాంటివి ఏమీ తీసుకోకుండానే అక్రమార్కులు ఇష్టా రాజ్యంగా రాజకీయ నాయకుల అండదండలతో యథేచ్ఛ గా అక్రమ లే అ వుట్స్‌ చేస్తూ అమ్ముకుంటూ కోట్లు ఘటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడుతున్న అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాండూరు మున్సిపల్‌కు అక్రమ లేఅవుట్‌తో సుమారు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది. తాండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న అక్రమ లే అవుట్‌ వ్యవహారం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడం గమ నార్హం. తాండూరు పట్టణ కేంద్రంలో నాయకులకు వ్యాపా రులకు ఒప్పందం ప్రకారం పనులు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాండూరు అక్రమ నిర్మాణాలు అక్రమ లే అవుట్‌లు ఆపాల్సిన అధికారులు చేతులు ముడు చుకొని కూర్చోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవతు న్నాయి. తాండూరు ప్రభుత్వ అధికారులు మామూళ్ళ మత్తు లో పడి అక్రమా ర్కులపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మున్సిపల్‌లో నిర్మాణంలో కోసం అనుమతి లేక బ్యాంకులోన్లు రాక సామా న్యులకు తిప్పలు తప్పడం లేదు. అయినా పదుల సంఖ్యలో అనుమతులు లేకుండానే ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం..
తాండూరు మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్‌ లపై చర్యలు తీసుకోంటాం.
తాండూరులో త్వరలో అక్రమ నిర్మాణాలు, లే అవుట్‌లను గుర్తి స్తాం.
తగిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులుకు సిఫార్స్‌ చేస్తాం.
– శంకర్‌ సింగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌