– పార్టీలోకి ఆహ్వానించిన డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ- డిచ్ పల్లి: కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు భారీ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. అదివారం డిచ్ పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలో సర్పంచ్ లావణ్య మధుసూదన్ రెడ్డి తోపాటు జి గంగారెడ్డి, ఆర్ హనుమాన్లు, కోరట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందల్ వాయి మండలంలోని కొత్త కోరుట్ల సర్పంచ్ రాములు నాయక్ అధ్వర్యంలో వెంగళ్ పాడ్, కె కె తండా లకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరు కలిసి కట్టుగా పనిచేసి గెలుపె ద్యేయంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి, డాక్టర్ జాహుర్, ఇందల్ వాయి మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గంగాధర్, గోపి, తో పాటు తదితరులు ఉన్నారు.