విద్యార్థినిలను వేధిస్తున్న కీచక ఉపాధ్యాయుడు

– దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు
– చక్రం తిప్పుతున్న పోలీస్ సిబ్బంది, విద్యాశాఖ అధికారి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి  జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయి పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాద్యాయుడు  పనిచేస్తున్నాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు విద్యార్థినిల పట్ల వెక్కిలి చేష్టలు, టచ్ చేయకూడని చోట టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని విద్యార్ఠుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ జడ్పీ హైస్కూల్ ఉన్నత తరగతి చదువుతున్న బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. క్లాస్ రూమ్‎లలో చిన్నారులను టచ్ చేయకూడని చోట టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థినీలు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోమవారం ఉదయం స్కూల్‎కి వచ్చి ఆందోళనకు దిగారు. దీనితో విద్యార్థినిలు ఉపాధ్యాయుని దేహశుద్ధి చేశారు. ఏ విషయం బయటకు రాకుండా ఉండేందుకు సోమేశ్వర గ్రామానికి చెందిన ఓ పోలీస్ సిబ్బంది, విద్యాశాఖలో పని చేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పరు. బాధిత బాలికల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. శనివారం ఉదయం పాఠశాలలోని లాబ్ గదిలోకి బాలికలను తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడని విద్యార్థినిలు కొందరు తెలిపారు.  ఆ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నత స్థానానికి చేరవేసే విధంగా తీర్చిదిద్దే విధంగా బాధ్యతగా మెలగాల్సింది పోయి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ చెప్పకూడని చోట తాకుతూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నాడు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మనోవేధన పడుతున్నారు. ఈ విషయం మండల విద్యాశాఖ అధికారులు తెలిసిన మౌనంగా ఊరుకున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని పలువురు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కోరాయి. లేనిపక్షంలో పాఠశాల ఎదురుగా బైఠాయించి పోరాటం చేస్తామని హెచ్చరించారు.