లూయిస్ బ్రెయిన్ లిపి జన్మదిన వేడుకలు…

Celebrating Louis Brain Lippi's birthday...– హాజరైన కలెక్టర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
లూయిస్ బ్రెయిలీ 216 వ జన్మ దినమును పురస్కరించుకొని  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ  అధికారి నరసింహారావు అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా   కలెక్టర్ మాట్లాడుతూ  అందులందరితో కలిసి లూయిస్ బ్రెయిలీ  చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేయించారు. అయిన కనిపెట్టినటువంటి లిపి ఎంతోమంది అందుల జీవితాలలో వెలుగులు నింపింది. అందులు అన్ని రంగాలలో ముందడుగు వేయడానికి లిపి తోడ్పడిందని తెలియజేశారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి  మాట్లాడుతూ బ్రెయిలీ  కనిపెట్టిన ఆరు చుక్కల లిపి గురించి మరియు ఆయన జీవిత విశేష గురించి తెలియజేశారు. ధరణి కోట నరసింహ గారు  లూయిస్ బ్రెయిలీ గురించి మాట్లాడుతూ బ్రెయిలీ  అందులకు ఆశాజ్యోతి ఆయన కనుగొన్న లిపి వలన మందుల మందరము చదువుకొని వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందగలుగుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఈఓ శ్రీమతి  దివ్యాంగుల శోభారాణి . జిల్లా కమిటీ ,  అసోసియేషన్ మెంబర్లు , సీడిపివోలు. కార్యాలయం సిబ్బంది , దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.