అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయీస్‌ బ్రెయిలీ

ప్రపంచంలోని అంధుల విద్య అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహ నీయుడు లూయిస్‌ బ్రెయిలీ.ప్రపంచంలోని అంధుల విద్య అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ప్రత్యేక లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహ నీయుడు లూయిస్‌ బ్రెయిలీ. చిన్నతనంలోనే చూపు కోల్పో యినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తనలాంటి అంధులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ప్రత్యేక లిపి కోసం పాటుపడ్డాడు. 1809 జనవరి 4న పారిస్‌ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించిన ఆయన బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కండ్లు కోల్పోయి అంధుడిగా మారాడు. పారిస్‌లో 1784లో వాలెం టైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో చేరాడు. ఆయ నకున్న తెలివితేటలను చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయారు అప్ప టికే అమలులో ఉన్న ‘లైన్‌ టైపు’ పద్ధతిలో పట్టుదలతో చదువుకుని పదిహేండ్ల వయసులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియ మించబడ్డాడు. పగలు పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పుతూ, రాత్రి సమయంలో అంధులు చదవగలిగే, రాయగలిగే లిపి తయారీ కోసం అహర్నిషలు కృషిచేసాడు. అంధులకు పుస్తకాలు స్పర్శతో గుర్తుపట్టి చదివేందుకు వీలుగా చుక్కలు ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు.
1821లో ఛార్లెస్‌ బార్బి యర్‌ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు పన్నెండు ఉబ్బెత్తు చుక్కలతో ఉన్న లిపిని బ్రెయిలీ ఆరు చుక్క లకు తగ్గించాడు. బ్రెయిలీ కనిపెట్టిన లిపికి అధికారిక గుర్తింపు కోసం అతని శిష్యులు చేసిన పోరాటం వలన అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని ప్రాన్స్‌ దేశం తమ ముద్దుబిడ్డగా ప్రకటించుకుంది. అంధులు చదువుకోవడానికి ఎక్కువ కృషి చేసింది అంధులే. స్పెయిన్‌ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్‌ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బివుండే అక్షరాలను చెక్కే పద్ధతి రూపొందించాడు. పారదస్‌ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతని మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ఫ్రింటు చేసే విధానం రూపొందించారు. తరువాత ఎంతోమంది దీని గురించి పరిశోధన కొనసాగించారు. అయితే అవి గుడ్డివారికి చదువు నేర్చుకొనడానికి అంత సులభంగా వుండేవి కావు.
కానీ బ్రెయిలీ మాత్రం తన నూతన పద్ధతి సిద్ధాంతీకరించాడు. ఐదేండ్ల పరిశోధనలో బ్రెయిలీ తన పద్ధతిలో సంపూర్ణత సాధిం చాడు. ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది విప్లవాత్మకమైన మార్పు, ఆరుపాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు చేశాడు. ఒక చుక్క నుండి ఆరు చుక్కల్లోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేశాడు. ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు ఈ ఆరు చుక్కలలో బ్రెయిలీ రూపొందించాడు. దీంతో గుడ్డివారికి ఇతరుల సహాయం అక్కరలేదు బ్రెయిల్‌లో రాయగలరు, చదవగలరు. అంధులకు అతను కనుగొన్న లిపికి గుర్తింపు అతని మరణానం తరమే వచ్చింది. సంగీతాన్ని కూడా తన లిపిలో రాయ డం అతని విశిష్టత. ఆధునికయుగంలో అందులు చదువుకునే పుస్తకాలన్నీ బ్రెయిలీ లిపిలో ఉంటున్నాయి. తన పరిశోధన ద్వారా విప్లవాత్మకమైన మార్పు సాధించి దీనిని కనుగొన్న వ్యక్తిగా లూయీస్‌ బ్రెయిలీగా చరిత్రకెక్కాడు. బ్రెయిలీ 1852 జనవరి 6న 43 సంవత్సరాల పిన్న వయస్సులోనే మరణించాడు. అంధులకు విద్యాదానం చేసిన బ్రెయిలీ చిరస్మరణీయుడు.
ప్రపంచం జనాభాలో నాటికి సుమారు 49.1మిలియన్ల మంది అంధులున్నారు.1990లో 34.4శాతం ఉంటే 2020నాటికి 49.1 శాతానికి అంధుల జనాభా పెరిగింది. అభివృద్ధి చెందిన అమెరికాలో 40ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారిలో 12 మిలియన్ల మందికి దష్టిలోపం ఉంటే,అమెరికాలో అత్యధిక మంది కండ్లద్దాలు అవసరం అవుతున్నవి.ప్రతి యేటా అమెరికాలో ఒక మిలియన్స్‌ అంధులు కంటి వైద్యున్ని సంప్రదిస్తున్నారు. 2020నాటికి అంధత్వాన్ని నివారించాలని ప్రారంభించిన విజన్‌ 2020లో భారత ప్రభుత్వం చేరింది. ప్రపంచంలోనే అత్యధిక అంధులు ఉన్న దేశం కూడా ఇండి యానే. దేశంలో పురుషుల కంటే స్త్రీలలో అంధత్వం ఎక్కువగా ఉంది.దేశంలో తొమ్మిది రాష్ట్రాలలో అంధుల పాఠశాల వివరాలు ప్రకారం 60 శాతం మంది అబ్బాయిలు పాఠశాలకు వెళ్తున్నారు. 40శాతం మంది మాత్రమే బాలికలున్నారు.రేటీనా క్షీణత వలన 16.7శాతం మంది పూర్తిగా కంటిచూపు కోల్పోతున్నారు. అంధుల సగటు జీవిత కాలం 40-55ఏండ్లు ఉంటోంది.
1976లో అంధత్వ నియంత్రణ జాతీయ కార్యక్రమం ప్రారం భించారు.2025నాటికి అంధత్వం కలిగిన వారి సంఖ్య 0.25 శాత నికి తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అది సాధ్యం కాలేదు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 1-7 వరకు దేశవ్యాప్తంగా అంధత్వ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2023లో నిర్వహించిన వారోత్స వాలలో అంధులకు, పుట్టుకతో అంధులు లేదా ప్రమాదం కారణం గా కంటిచూపు కోల్పోయిన వారికి కంటి విలువ తెలియ చేయడా నికి అవగాహనా కల్పించేందుకు 2023 ఏప్రిల్‌ 1-7వరకు అంధత్వ నివారణ వారోత్సవాలు అన్ని రాష్ట్రాల్లో జరిగాయి. 2021 -22లో గుజరాత్‌ రాష్ట్రం అంధత్వ నివారణ కోసం రూ.4295.22 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసి కేవలం 1288.80కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తెలంగాణలో రూ.1125.70 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించి 283.87కోట్లు ఖర్చు చేసింది. గొప్పగా నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో మన పాలకులకు అంధత్వ నిర్మూలన పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంధుల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. సామూహిక ప్రాంతాల్లో బ్రెయిలీ లిపిని అందు బాటులో ఉంచాలి. అన్ని రకాల అంధత్వం కలిగిన వారికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారిచేయాలి. ప్రభుత్వ సమాచారం, జీవోలు, చట్టాలు బ్రెయిలీ లిపిలో ముద్రించి అందుబాటులోకి తేవాలి. వారికి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరముంది.
(నేడు లూయిస్‌ బ్రెయిలీ 215వ జయంతి)
– యం అడివయ్య, 9490098713