విదేశీ పోకడల ఆధునికత
వెల్లువెత్తుతుంటే
యువతలో ‘ప్రేమ’ అనే రెండక్షరాల
ఆకర్షణ సహజం అది రగిలి
అపరిపక్వ అగ్గిరవ్వలు యువతనే
బలిగొంటాయి
బాధ్యతతో కూడిన బంధాలు
యువతీ యువకుల మధ్య
ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమే!
ప్రతి ప్రేమికుల దినోత్సవాన్ని
దేదీప్యంగా వెలిగించే వెలుగు దివ్వెలు
నిజమైన ప్రేమ బంధాలే!
ఏ ప్రేమికుల దినోత్సవం..
అమ్మాయిల మనసుల్ని ప్రేమ
పేరుతో దోచుకొని వేధించే
శారీరక వాంఛల విషవలయం కారాదు
మన సంస్కతి సంప్రదాయాలకు
విలువిచ్చే బంధాలు మరింత గట్టివి!
ప్రేమంటే ఆ రోజునే పుట్టేది
బహుమతులు కుమ్మరించి
ప్రదర్శించేది కాదు!
ఒకరినొకరు అర్థం చేసికొనేది
ఎప్పటికి శాశ్వతంగా నిల్చేదే ప్రేమ!
(ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా)
– భీమవరపు పురుషోత్తమ్
9949800253