లవ్‌ రెడ్డి గెలిచాడు

Love Reddy wonగీతాన్స్‌ ప్రొడక్షన్స్‌, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లవ్‌ రెడ్డి’. అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్‌ రెడ్డి రూపొం దించారు. ప్రొడ్యూసర్స్‌ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్‌ జి, మదన్‌ గోపాల్‌ రెడ్డి, నాగరాజ్‌ బీరప్ప, ప్రభంజన్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్‌, బాబు, రవి కిరణ్‌, జకరియా సహ నిర్మాతలు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వచ్చి, ప్రేక్షకుల నుంచి సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ మీట్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో మేకర్స్‌ నిర్వహించారు. ప్రొడ్యూసర్‌ మదన్‌ గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతున్నారు. సినిమాను ఎలాగైనా నిలబెట్టండి అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. వాళ్లకు తోచిన అమౌంట్స్‌ యూపీఐ ద్వారా నాకు పంపిస్తున్నారు. నిర్మాతగా ఆ సంతప్తి నాకు చాలు’ అని తెలిపారు. ‘మా సినిమాకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. బ్లాక్‌ బస్టర్‌ మూవీ అంటున్నారు. మంచి సినిమాను బతికించమని రిక్వెస్ట్‌ చేస్తున్నాం’ అని డైరెక్టర్‌ స్మరణ్‌ రెడ్డి చెప్పారు.

మా మూవీకి ప్రేక్షకుల నుంచే కాకుండా మీడియా నుంచి కూడా మంచి రివ్యూస్‌ వచ్చాయి. మా లవ్‌ రెడ్డి థియేటర్లలో గెలిచాడు. చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. ప్రీమియర్స్‌ నుంచి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో మూవీని హ్యాపీగా రిలీజ్‌ చేశాం. మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ నుంచి మా మూవీకి పూర్తి సపోర్ట్‌ దొరికింది. ఈ సినిమా ఎలాగైనా నిలబెట్టాలని నా స్నేహితుడు కిరణ్‌ అబ్బవరం హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, విజయవాడలో ఫ్రీ షోస్‌ అరేంజ్‌ చేశాడు. ఈ ఫ్రీ షోస్‌ కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కొందరు తమ లైఫ్‌ లో జరిగిన లవ్‌ ఫెయిల్యూర్స్‌ గురించి చెబుతూ ఉద్వేగంగా మాట్లాడుతున్నారు.
– హీరో అంజన్‌ రామచంద్ర