లవ్‌ యు రామ్‌ రిలీజ్‌కి రెడీ

డైరెక్టర్‌ కె దశరథ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్‌ యు రామ్‌’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకుడిగానే కాకుండా నిర్మాత కూడా. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్దనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ,’ఈనెల 30న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మైత్రీ మూవీస్‌ వారి ద్వారా విడుదల చేస్తున్నాం. ఇదొక మంచి ఎంటర్‌టైనర్‌. మ్యూజిక్‌, కథ అన్నీ బావుంటాయి’ అని చెప్పారు.’అందరికీ నచ్చేలా సినిమా వచ్చింది. ఇప్పటి వరకూ చూసిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి’ అని దర్శకుడు, నిర్మాత డివై చౌదరి అన్నారు.