– మూడ్రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. రాబోయే 24 గంటల్లో ఇది కాస్తా మరింత బలపడి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా మరింత చురుగ్గా కదిలే అవకాశముంది. రాబోయే మూడు రోజుల పాటు ఉత్తర, తూర్పు తెలం గాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పలు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలర్ట్ చేశారు. కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికను జారీ చేసింది.