సహ-రుణాల రంగంలోకి అడుగుపెడుతున్న ఎల్ & టి ఫైనాన్స్ లి.

నవతెలంగాణ హైదరాబాద్: దేశంలోని ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్‪బిఎఫ్‪సిలు) ఒకటి అయిన ఎల్ & టి ఫైనాన్స్ లి., (ఎల్టిఎఫ్), సిఆర్ఇడి సభ్యులకి పూచీకత్తులేని వ్యక్తిగత రుణాలు అందించడానికి, సంపన్నుల చెల్లింపుల ప్లాట్‪ఫాం అయిన సిఆర్ఇడితో భాగస్వామ్యం కూడుతున్నట్టు ప్రకటించింది.
సిఆర్ఇడికి చెందిన సంపన్నలు, రుణవిశ్వాసనీయతగల సభ్యుల సమూహం వేగంగా, అనుగుణ్యంగా, ఇబ్బందులు లేని విధంగా సిఆర్ఇడి నగదు ఉత్పత్తి ద్వారా రుణాన్ని అందుకోగలుగుతారు. తన సహరుణ భాగస్వామి, ఒక ఎన్‪బిఎఫ్‪సి అయిన న్యుటాప్ ఫైనాన్స్ ప్రైవేట్ లి. (న్యూటాప్) ద్వారా ఎల్‪టిఎఫ్ ఈ రుణాలు అందిస్తుంది. సిఆర్ఇడి సభ్యులు, అనుగుణ్యమైన తిరిగిచెల్లింపు వ్యవధులతో, పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో కొన్ని నిముషాల్లోనే రుణాన్ని పొందగలుగుతారు.
సుదిప్తా రాయ్, మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ, ల్ & టి ఫైనాన్స్ లి., ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, “సిఆర్ఇడితో మా భాగస్వామ్యాన్ని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ భాగస్వామ్యంతో ఎల్‪టిఎఫ్, సహరుణాల రంగంలోకి అడుగుపెడుతోంది, ఫైనాన్స్ సేవల రంగంలో ఎల్‪టిఎఫ్ అపారమైన అనుభవ బలం, సిఆర్ఇడికి చెందిన రుణవిశ్వాసనీయతకి పేరుపొందిన, బలమైన సంపన్న ఖాతాదారుల పెద్ద సమూహం, డిజిటల్ రుణాల్లో, ముప్పు అంచనాల్లో న్యూటాప్ అనుభవాలని ఇది ఇనుమడింపచేస్తుంది. అనుగుణ్యమైన తిరిగి చెల్లింపు కాలవ్యవధులతో, పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లతో సిఆర్ఇడి ఖాతాదారులకి కొన్ని నిముషాల్లోనే రుణాలు అందించడం ద్వారా ఖాతాదారుల అనుభవం పై దృష్టిపెట్టి, ఇబ్బందులులేని, ప్రత్యేకమైన రుణ స్వీకరణ అనుభవాన్ని అందించడానికి, డిజిటల్ రుణాల రంగంలో మా ఉనికిని మరింత మెరుగుపర్చుకోడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని నమ్ముతున్నాం” అన్నారు.
కునాల్ షా, వ్యవస్థాపకులు, సిఆర్ఇడి, మాట్లాడుతూ “దేశంలోని అత్యంత ప్రసిద్ధ రుణదాతల్లో ఒకరి నుంచి రుణ ఏర్పాటు ద్వారా, ఎక్కువ క్రెడిట్ స్కోర్లు, మచ్చలేని తిరిగి చెల్లింపుల చరిత్ర కలిగిన మా సంపన్న సభ్యులకి సాధికారత కల్పించడానికి ఈ భాగస్వామ్యం అవకాశం కల్పిస్తుంది. ఇది కేవలం రుణం అందించడం గురించి మాత్రమే కాదు; ఇది ఒక ఆర్థిక సత్తువ ఆవృత్తాన్ని పెంచిపోషించడం గురించి, హైక్వాలిటీ సంస్థలు, హైక్వాలిటీ ఖాతాదారులు కలవడం, సమూహం, పరిశ్రమా రెండూకూడా ప్రగతి సాధించడం గురించి” అన్నారు.
ఖాతాదారుపై దృష్టిపెట్టే ఎల్‪టిఎఫ్ వైఖరి, కొత్త క్వాలిఫైడ్ కస్టమర్ అక్విజిషన్ ఛానెల్స్ తో భాగస్వామ్యం కలిసి, వ్యక్తిగత రుణాల వ్యాపారంలో దాని ప్రగతిని ముందుకు నడిపించేయి. దాని బుక్ సైజ్, 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికలో గణనీయమైన 11% ఏటి కేడాది వృద్ధితో రూ. 6,667 కోట్లకు పెరిగింది, ఈ త్రైమాసికలో పంపిణీలు రూ. 1,178 కోట్లకి పెరిగేయి. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారాలు, కొత్త భౌగోళిక ప్రదేశాల్లోకి విస్తరించడం, ఖాతాదారులని నిలుపుకోవడంతోపాటు పలు ఇతర అంశాల ప్రేరేపణవల్ల  ఎల్‪టిఎఫ్ వారి వ్యక్తిగత రుణాల వ్యాపారం ఇంకా ప్రగతి సాధిస్తుందని ఆశ్తున్నారు.