ఇచ్చిన అవకాశాన్ని ఎల్టి మాడ్గేజ్ లోన్ రైతులు సద్వినియోగం చేసుకోవాలి :విండో కార్యదర్శి జే

నవతెలంగాణ – మద్నూర్
ఎల్ టి మాడ్గేజ్ లోన్ రైతులకు ఓ టి ఎస్, వన్ సెటిల్మెంట్ రుణ చెల్లింపుకు ఇచ్చిన అవకాశాన్ని రుణాలు తీసుకున్న రైతులంతా రుణాలు చెల్లించి సద్వినియోగం పంచుకోవాలని మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి జె బాబుపటేల్ ఎల్ టి లోన్ రైతులకు సూచించారు. సింగిల్ విండో పరిధిలో ఎల్టి మాడ్గేజ్ రుణాలు తీసుకున్న 92 మంది రైతులకు గాను నాలుగు కోట్ల ఐదు లక్షల 17,863 రూపాయలు బకాయిలు ఉన్నట్లు తెలిపారు ఈ రుణాలకు గాను ప్రభుత్వం మార్చి చివరి నాటికి ఓ టి ఎస్ ద్వారా చెల్లించుకోవడానికి అవకాశం ఇచ్చిన దానిని రుణబకాయిదారులు ఒకేసారి చెల్లించుకుని బకాయిలో తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదని ఈ మార్చి చివరినాటికి ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని విండో కార్యదర్శి ఎల్టి మాడ్గేజ్ రుణ రైతులను కోరారు పెద్ద మొత్తంలో గల బకాయిని ఒకేసారి చెల్లించుకునే అవకాశం కల్పించినందున రుణాలు పొందిన రైతులంతా బకాయిలు కొంత తగ్గించుకునే అవకాశం ఉన్నందున బకాయి దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.