ఘనంగా ‘లక్కీ భాస్కర్‌’ విజయోత్సవం

The grand success of 'Lucky Bhaskar'‘నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను, ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. ‘లక్కీ భాస్కర్‌’ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది. ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన తను ‘సార్‌’ సినిమా నుంచి రూట్‌ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్‌లకు, క్యారెక్టర్లను హ్యాండిల్‌ చేసిన విధానానికి హ్యాట్సాఫ్‌’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొంది, విడుదలైన సినిమా ‘లక్కీభాస్కర్‌’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బందంతో పాటు నిర్మాత దిల్‌ రాజు, దర్శకులు నాగ్‌ అశ్విన్‌, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, ‘సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని నాకు ఫస్ట్‌ మెసేజ్‌ చేసింది జి.వి.ప్రకాష్‌. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్‌ కాంబో. నిర్మాతలకు జి.వి.ప్రకాష్‌ లాంటి టెక్నీషియన్స్‌ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న ‘మహానటి’ కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను రాఘవపడి ‘సీతారామం’తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ ‘లక్కీ భాస్కర్‌’ లాంటి సినిమా ఇచ్చారు’ అని తెలిపారు. ”లక్కీ భాస్కర్‌’తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్‌ మనతో లైఫ్‌ లాంగ్‌ ఉంటుంది. అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నిర్మాత నాగవంశీ. ఆయనకు పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం హ్యాపీగా ఉంది’ అని అన్నారు.