ఇప్పటి వరకూ నేను చాలా సినిమాలు చేశాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం నాకు చాలా స్పెషల్. ‘గోదారి గట్టు..’ పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తే, ప్రతి ఒక్కరూ నాతో ఫొటో తీసుకుంటు న్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్‌లా పాకింది’ అని ఐశ్వర్య రాజేష్ అన్నారు.
వెంకటేష్, అనిల్ రావి పూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీడియాతో ముచ్చటించారు.
– ‘సుడల్’ వెబ్ సిరిస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్‌కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను.
– దర్శకుడు అనిల్ నెరేషన్ వింటూ పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్‌లో ఇంత ఎంజారు చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. నేను పోషించిన భాగ్యం పాత్ర నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.
– వెంకటేష్‌తో యాక్ట్ చేయడం బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ప్రేక్షకులు చూస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. ఈ పాత్ర చేయటంలో వెంకీ, అనిల్ సపోర్ట్ మర్చిపోలేను.
– భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్.
– ఇలాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా రోజులైంది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. దర్శకుడు అనిల్ చాలా క్రియేటీవ్‌గా ఈ కథని చెప్పారు. మీనాక్షి చౌదరితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
– తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు ‘గోదారి గట్టు..’ పాటతో తీరింది. వెంకీ లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం, అది వైరల్ హిట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే పాటలన్నీ చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగంపాసై పోయినట్లే. అందరూ ఎంజారు చేసే సినిమా ఇది.