అచ్చంపేట పురపాలక సంఘంలో లుకలుకలు…?

– చైర్మన్ గిరి పై అవిశ్వాసం యోచన..?
నవతెలంగాణ- అచ్చంపేట: రాష్ట్రవ్యాప్తంగా నియోజక వర్గం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా డాక్టర్ వంశీకృష్ణ గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. పది ఏళ్లు బారాస ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేట మున్సిపాలిటీలో చైర్మన్ గా.. బారాస అభ్యర్థి నరసింహ గౌడ్ ను ఎన్నుకున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 13 మంది కౌన్సిలర్లు బారాస పార్టీ నుండి గెలుపొందారు. 6 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. ఒక కౌన్సిలర్ బిజెపి నుండి గెలుపొందాడు.  అయితే ఇప్పటికే… ఐదో వార్డ్  కౌన్సిలర్ , వైస్ చైర్మన్ భర్త విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ సంఖ్య 8 చేరుకుంది. మరో నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ కౌన్సిలర్ల మెజార్టీ పెరుగుతుంది.  దీంతో చైర్మన్ గిరి పై అవిశ్వాసం తీర్మానం ఏర్పాటుచేసి జిల్లా కలెక్టర్ కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొందరు మునిసిపల్ చైర్మన్లు,  వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 మున్సిపల్ యాక్ట్  ముందు నిబంధనలు ప్రకారం అమలు చేయాలని స్పష్టంగా తీర్పునిచ్చిందనీ  అవిశ్వాసం పెట్టుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మెజార్టీ గల కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పైన కలెక్టర్ కు ఆపిల్ చేసుకునే  అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.  అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ నలుగురు కలిసిన మునిసిపల్ చైర్మన్ పైన అవిశ్వాసం పెడుతున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలు, రాజకీయ నాయకులు ఆసక్తితో వేచి చూస్తున్నారు.