రుద్రాపూర్: లూమినస్ పవర్ టెక్నాలజీస్ కొత్తగా సోలార్ ప్యానెల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఉత్తరాఖాండ్‌లోని రుద్రాపూర్‌లో అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ లాంచనంగా ప్రారంభించారు. తొలి దశలో రూ.120 కోట్లతో 250 మెగావాట్ సామర్థ్యం తో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు లూమినస్ పవర్ టెక్నాలజీస్ ఎండి, సిఇఒ ప్రీతీ బజాజ్ తెలిపారు. ఈ ప్లాంట్‌ను 1గిగావాట్‌కు విస్తరించనున్నామన్నారు.