సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో  రైతులకు మధ్యాహ్న భోజనం 

–  ప్రారంభించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ పంటను విక్రయించడానికి వచ్చిన రైతులకు  సీబీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో   మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు.  రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. వేరుశనగ పంటలు విక్రయించడానికి వచ్చిన రైతులు ఉన్నారని , రైతుల ఆకలి దృష్టిలో పెట్టుకొని క మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది , కమిషన్ దారులు రైతులకు ఇబ్బందులు లేకుండా కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు,  ప్రజాప్రతినిధులు,  రైతులు నాయకులు,  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.