
మండల పరిధిలోని బేగంపేట ప్రభుత్వోన్నత పాఠశాలను శనివారం మండల కాంగ్రెస్ నాయకులు సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నాయకులు బోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన బోజనాన్ని అందించాలని నిర్వహాకులకు నాయకులు సూచించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,జనాగం శంకర్,నాయకులు మధు సూదన్ రెడ్డి,జెల్లా ప్రభాకర్,భైర సంతోష్,బుర్ర తిరుపతి పాల్గొన్నారు.