‘మధ్యాహ్న భోజనం’ ప్రయివేట్‌ పరం

– సీఐటీయూ సంఘం మండల కన్వీనర్‌ బుట్టి బాల్‌రాజు
– ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కందుకూరు
54 వేల మధ్యాహ్న భోజ న కార్మికుల పొట్ట కొట్టడానికి సీ ఎం రేవంత్‌ రెడ్డి మధ్యాహ్న భో జన పథకాన్ని ప్రయివేట్‌ సం స్థకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారని వెంటనే విరమిం చుకోవాలని సీఐటీయూ సం ఘం మండల కన్వీనర్‌ బుట్టి బా ల్‌రాజు డిమాండ్‌ చేశారు. మం గళవారం కందుకూరు ఆర్డీ వో కార్యాలయం ఎదుట నిర్వహిం చిన ధర్నాలో ఆయన మాట్లా డుతూ..మధ్యాహ్న భోజన పథ కాన్ని హరే రామ, హరేకృష్ణ లాం టి సంస్థలకు ఇవ్వకూడదన్నా రు. 24 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మధ్యా హ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు చేస్తున్నా రని తెలిపారు. వీరికి అడపా దడపా బిల్లులు చెల్లిస్తూ, జీతా లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతీ నెల బిల్లులు చెల్లించి, నెల కు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమం లో మధ్యాహ్నం సంఘం అధ్య క్షురాలు ప్రభావతి కార్యదర్శి కళ్యాణ్‌ శ్రీనివాస్‌, అండాలు, లక్ష్మమ్మ, స్వప్న, మంజుల, సత్తె మ్మ, ప్రమీల, రాధా, పాల్గొన్నారు.