మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య, తహసీల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ ఏజెన్సీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు. మండల విద్యాధికారి ఆంధ్రయ్య మాట్లాడుతూ వంటగది దాని పరిసరాలు శుభ్రంగా ఉండాలని, నాణ్యమైన ఆహార పదార్థాలు ఉపయోగించాలన్నారు. వంట పాత్రలు శుభ్రంగా ఉంచాలని, వండే ముందు వంట పాత్రలను తప్పనిసరిగా కడగాలని, నూనె, పసుపు, కారం, ఉల్లి, వెల్లుల్లి, వంటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా నాణ్యమైనవి ఉండాలన్నారు. వంటకు ఉపయోగించే నీరు కూడా మంచి నీరై ఉండాలని, ఎక్కడ ఎలాంటి కలుషితం కాకుండా విద్యార్థులకు మంచి భోజనం అందిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు రాజేశ్వరగౌడ్, సిఆర్ పి లలిత, ఎంఐఎస్ సురేందర్, ఆపరేటర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.