మధ్యాహ్న భోజన కార్మికులు దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ఆవిష్కరణ 

నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్  మండల మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొంటారని ఎంఈఓ కి సమ్మె నోటీసు అందజేశారు. ముఖ్యంగా దేశములో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేక పోగా బడ్జెట్లో ఇప్పటివరకు ఎలాంటి కేటాయించలేదు ముఖ్యంగా గతంలో ఉన్న ప్రభుత్వము  75% నిధులు కేటాయిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60% శాతానికి కుదించడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు పిల్లల సంరక్షణ చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వము కార్మికులను ఇటు పిల్లల సంరక్షణలో విపులమైందని  నేను చెప్పదలుచుకున్నాను
కాబట్టి రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొంటారని అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు స్లాబరేటు ఒక విద్యార్థి 25 రూపాయలు ఇవ్వాలని,అదేవిధంగా నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ప్రతి కార్మికురాలికి 26,000 జీతాన్ని కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికులుగా గుర్తించాలని ,ఇతర ఇతర సమస్యలు పరిష్కరించాలని  కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈనెల 16వ తారీఖు నాడు దేశ వ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొంటామన్నారు. ఈ సమావేశంల మధ్యాహ్న భోజన కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు అని జిల్లా కమిటీ పిలుపు ఇచ్చారు.  ఈ సమావేశంలో బి గంగాధర లావణ్య సాయమ్మ కౌసల్య గంగమని కార్మికులు పాల్గొన్నారు.