మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

Lunch workers protest– ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి
– రోడ్లు ఊడ్చిన ఆశాలు
నవతెలంగాణ- విలేకరులు
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశాలు బుధవారం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడించారు. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అంద జేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో మధ్యాహ్న భోజన కార్మికులు కండ్లకు గంతలు కొట్టుకొని నిరసన తెలిపారు. భద్రా చలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాల యాన్ని ముట్టడించారు. కార్మికుల సమస్యలు విన్న ఎమ్మెల్యే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దమ్మపేట మండలం, తాటిసుబ్బనగూడెంలో ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు.
మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె నల్లగొండ జిల్లా కేంద్రం లోని డీఈఓ కార్యా లయం ఎదుట సూర్యా పేట జిల్లా కోదాడ పట్ట ణంలో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారం భించేం దుకు వచ్చిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను మధ్యా హ్నభోజన కార్మికులు అడ్డు కున్నారు. వినతి పత్రాన్ని అంద జేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మధ్యా హ్న భోజన కార్మికుల సమస్యలపై సీఎం కేసీ ఆర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మఠంపల్లి మండ లంలో కార్మికులు భిక్షాటన చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండ లంలో ఆశాల సమ్మెకు సీఐటీయూ మండల కన్వీనర్‌ నీలా రామ్మూర్తి మద్దతు తెలిపారు. మున గాల మండ లంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి సంఘీభావం తెలిపారు.
రోడ్లు ఊడ్చిన ఆశాలు
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండల కేంద్రంలోని నర్సాపూర్‌ చౌరస్తాలోఆశావర్కర్లు రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండా వద్ద ఆశాలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఆళ్లపల్లిలో భిక్షాటన చేశారు.