నవతెలంగాణ – నాగిరెడ్డి పేట్
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం రోజు మధ్యాహ్న భోజన కార్మికులు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తమ న్యాయమైన సమస్యలు డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ సమ్మె ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొన సాగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం కార్మికుల సంఘం నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు రియాజుద్దీన్ .బాలమణి .వెంకటి. సుజాత. తదితరులు పాల్గొన్నారు.