హనోయి: వియత్నాం సోషలిస్టు రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడిగా లుయాంగ్ క్యూంగ్ ఎన్నికయ్యారు. పార్ల మెంటు సభ్యులు సోమవారం నాడిక్కడ సమావేశమై ఆయనను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 67 ఏళ్ల లుయాంగ్ ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీ, సెక్రటేరియట్‌లో శాశ్వత సభ్యుడిగాను, పొలిట్‌బ్యూరో సభ్యుడిగాను ఉన్నారు. ఆయన 1975లో సైన్యంలో చేరారు. 2011 జనరల్ డిపార్టు మెంట్ ఆఫ్ ఫాలిటిక్స్ వైస్ సడైరక్టర్‌గాను, 2016లో డైరక్టర్‌గాను బాధ్యతలు నిర్వహించారు. . ఈ ఏడాది మేలో త్రువాంగ్ తి మై స్థానంలో ఆయనను కేంద్ర కమిటీ సెక్రటేరియన్ శాశ్వత సభ్యునిగా పొలిట్‌బ్యూరో నియమించింది.. అధ్యక్షుడి హోదాలో ఆయన తొలి ప్రసంగం చేస్తూ, దేశ ప్రజలకు, రాజ్యాంగానికి కచ్చితంగా విధేయతతో ఉంటానని, రాజ్యాంగంలో పేర్కొన్న విధులను, పార్టీ , ప్రభుత్వం, ప్రజలు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.