హాస్టల్  విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి: ఎం ధర్మానాయక్

నవతెలంగాణ – అచ్చంపేట 
లింగాల గిరిజన హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. హాస్టల్ బిల్డింగు ఎప్పుడు కూలుతుందోనని భయం భయంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వసతులతో పాటు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం ధర్మనాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజన బాలుర వసతి గృహాన్ని గిరిజన సంఘం బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాత్రూమ్స్ లేక ఊరు బయటకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఎవరికి చెప్పిన పట్టించుకోవడంలేదని, కనీసం నీళ్ల సమస్య నైనా పరిష్కారం చేయండి అని హాస్టల్ వార్డెన్ ను విద్యార్థులు బృందం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. తాగడానికి మంచి నీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని తినేటప్పుడు నీళ్లు లేక ఎక్కిలి వచ్చిన అట్లాగే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటు పుస్తకాలు వచ్చి స్టోర్ రూమ్ లో మొలుగుతున్నాయని,  స్కూలు తెరిచి 20 రోజులు కావస్తున్న విద్యార్థులకు పంపిణీ చేయలేదన్నారు. కాలం చెల్లిన స్నాక్స్ ఇస్తున్నారని అన్నారు. సరఫరా చేసిన జిసిసిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంటు వైర్లు వేలాడబడుతున్న పట్టించుకునే వాడే లేడు విద్యార్థుల షాక్ తగిలితే అంతే సంగతులు. వాటర్ ట్యాంకి శుభ్రం చేయక కొన్ని సంవత్సరాలు కావస్తుందని విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో విద్యార్థులు ఆటలాడుకోవటానికి ఆట వస్తువులు లేవు సౌకర్యం కల్పించే నాధుడే లేడన్నారు.  గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి హాస్టలను సందర్శించి వెంటనే విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ పాల్గొన్నారు.