బెస్ట్ ఎంప్లాయిమెంట్ అవార్డు అందుకున్న ఎం.సాయి కుమార్..

M. Sai Kumar received the Best Employment Award.– మీ సేవలు అమూల్యమైనవి ఎస్ టి ఓ శివరాజ్ అభినందన

నవతెలంగాణ – మద్నూర్
76వ గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయిమెంట్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని ఎస్ టి ఓ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహించే ఎం సాయి కుమార్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సాయికుమార్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు అందుకున్నందుకు ఎస్ టి ఓ కార్యాలయ ఎస్ టి ఓ అధికారి శివరాజ్ మాట్లాడుతూ ఎం సాయికుమార్ సేవలు అమూల్యమైనవని ఆయనను అభినందించారు.