అశ్వారావుపేట తహశీల్దార్ గా ఎం.శ్రీనివాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట తహశీల్దార్ గా ఎం. శ్రీనివాస్ విధుల్లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో చేపట్టిన బదిలీల్లో భాగంగా అశ్వారావుపేట తహశీల్దార్ గా చర్ల లో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ ను అశ్వారావుపేట కు, ఇక్కడ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన క్రిష్ణ ప్రసాద్ ను భూర్గంపాడు కు సోమవారం కలెక్టర్ ప్రియాంక అల బదిలీ చేసారు. దీంతో క్రిష్ణ ప్రసాద్ సోమవారం రిలీవ్ అయి భూర్గంపాడు లో జాయిన్ కాగా, చర్ల తహశీల్దార్ ఎం.శ్రీనివాస్ బుధవారం అశ్వారావుపేట లో విధుల్లో చేరారు. క్రిష్ణ ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆగస్ట్ 14 అశ్వారావుపేట రాగా, ఎన్నికల అనంతరం ఎం.శ్రీనివాస్ 13 రోజులు క్రితమే చర్ల వెళ్ళారు.
చర్ల నుండి బదిలీ అయి వచ్చిన తహశీల్దార్ శ్రీనివాస్ కు డి.టి సుచిత్ర, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రావు, ఆర్.ఐ లు పద్మావతి, క్రిష్ణ లు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై పరిపాలనా పరమైన అంశాలు చర్చించారు.